చైతూకు జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటు తెలుగు అటు తమిళ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి ‘రకుల్‌ప్రీత్‌సింగ్’. ఇప్పటికే ఈమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. మెగా ఫ్యామిలీ నుండి చరణ్‌తో ‘బ్రూస్‌లీ’లో నటించి ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘్ధృవ’లో సైతం నటిస్తోంది. అలాగే అల్లుఅర్జున్‌తో ‘సరైనోడు’ వంటి సూపర్ హిట్‌లో జోడికట్టి మరో మెగా హీరో ధరమ్‌తేజ్ చేస్తున్న ‘విన్నర్’లో హీరోయిన్‌గా ఫిక్సైంది. ఇక నందమూరి ఫ్యామిలీలో తారక్‌తో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఆడి పాడింది. అంతేగాక సూపర్ స్టార్ మహేష్‌బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో కూడా రకులే హీరోయిన్. ఇలా స్టార్ హీరోలందరి సరసనా నటించేసిన ఈమె మిగిలిన అక్కినేని ఫ్యామిలీని కూడా టచ్ చేసేసింది. తాజాగా ‘ప్రేమమ్’ సినిమాతో హిట్ అందుకున్న నాగచైతన్య ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 7నుండి మొదలుకానుంది. ఇందులో రకుల్‌ప్రీత్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. దీంతో రకుల్ పరిశ్రమలోని పెద్ద ఫ్యామిలీ హీరోలందరితోనూ నటించేసిన ఘనత దక్కించుకుంది.