గౌతమీపుత్ర ట్రైలర్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ కథానాయకుడిగా ఫస్ట్ ఫ్రేమ్స్ పతాకంపై జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ వందో చత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ భారీఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని, అది చూస్తుంటే సినిమాకోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతుందన్నారు. జనవరి 12న సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్లను యు.ఎస్, యు.కెతో సహా ప్రపంచ వ్యాప్తంగా వంద కేంద్రాలలో ఒకేసారి విడుదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ మొదటివారంలో ఈ వేడుకను జరుపుతామని, అన్ని వివరాలను త్వరలో తెలుపుతామని వారన్నారు. హేమామాలిని, శ్రీయ, కబీర్‌బేడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:జ్ఞానశేఖర్, సంగీతం:చిరంతన్ భట్, పాటలు:సీతారామశాస్ర్తీ, మాటలు:సాయి మాధవ్ బుర్రా, దర్శకత్వం:క్రిష్.