స్పీడు పెంచింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అ ఆ, జనతా గ్యారేజ్ సినిమాల తరువాత గ్లామర్ భామ సమంత తెలుగులో ఇంక ఏ సినిమాకూ ఓకె చెప్పలేదు. ‘జనతా గ్యారేజ్’ సమయంలో తెలుగులో నచ్చిన పాత్రలు, నటనకు ఆస్కారమున్న పాత్రలు రావడం లేదని, ఏ సినిమా ఒప్పుకోవడంలేదంటూ షాకిచ్చింది. తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమైంది. విశాల్ సరసన నటిస్తున్న సమంత మరో రెండు తమిళ చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. విశాల్‌తో నటిస్తున్న చిత్రానికి ‘ఇరుంబుత్తిరాయ్’ అనే టైటిల్‌ను ఓకే చేశారు. ఆగస్టులో ఈ సినిమా మొదలై అప్పుడే ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమా గురించి ఈమె సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతోంది. విశాల్‌తో చేస్తున్న సినిమా బాగా వస్తోందని, దర్శకుడు సూపర్ అంటూ కామెంట్లు పెట్టిన సమంతకు తెలుగు సినిమాల్లో సరైన పాత్రలు దక్కలేదంటూ హింట్ ఇచ్చినట్టుగానే వున్నట్టుంది. ప్రస్తుతం పవన్ సరసన నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. మొత్తానికి త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సమంతకు సరైన పాత్రలు దక్కేలా వున్నాయి. ప్రస్తుతం ప్రేమాయణంలో వున్న ఈమె, వున్న తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయడానికి జోరు పెంచిందని అంటోంది కోలీవుడ్.