బాస్ ఈజ్ బ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఖైదీ నెం.150’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై హీరో రాంచరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా శనివారం విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి ‘లుక్’ ఎలా వుంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తికి తగ్గట్టుగానే ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనేలా చిరంజీవి స్టైల్ ఆకట్టుకోనుంది. ఈ ఫస్ట్‌లుక్‌ను రాంచరణ్ విడుదల చేసి, ‘ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ సోమవారం నుంచి మొదలుపెడతాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. త్వరలోనే పాటల కోసం విదేశాలకు వెళ్లనున్నాం. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. దేవిశ్రీ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్:తోట తరణి, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:రత్నవేలు, నిర్మాత:రాంచరణ్, దర్శకత్వం:వి.వి.వినాయక్.