జీవితమే ఒక దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయుల సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా అనూచానంగా ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలలో పండుగలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. భారతీయులంతా ఆనందంగా జరుపుకునే అరుదైన పండుగలలో దీపావళి ఒకటి. దీపాల వరుసలాగా ప్రజల జీవితాలు కూడా ఆనంద
తరంగాలలో తేలే పండుగ ఇది. దీపావళిని గుర్తుకుతెస్తూ తెలుగు
సినిమాల్లో అనేక పాటలు రవ్వల పువ్వులు విరబూశాయి. వాటిలో
కొన్ని పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ శ్రోతల గుండెల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.
ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీ రామారావు నల్లనయ్యగా నటించిన ‘దీపావళి’ చిత్రాన్ని ఆ పండుగ ప్రాశస్త్యం గురించి, పురాణ కథనం ఆధారంగా రూపొందించారు. సత్రాజిత్తు (గుమ్మడి) అవివేకం వల్ల జరిగే కథనంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సావిత్రి అద్భుత అభినయంతో ప్రేక్షకులకు ఆనంద దీపావళి కలిగించారు.
ఆ మధ్య వేణు కథానాయకుడిగా ‘దీపావళి’ పేరుతో ఓ చిత్రం వస్తే, ప్రభాకర్‌రెడ్డి, విజయలలిత ప్రధాన తారాగణంగా ‘ఇంటింటా దీపావళి’ చిత్రం కూడా ప్రేక్షకులను పలకరించింది. దీపావళిని ప్రధానంగా చేసుకొని అనేక చిత్రాల్లో పాటల కూర్పు కూడా తెలుగు ప్రేక్షకులను రంజింపజేసింది.
‘షావుకారు’లో శాంతకుమారి, షావుకారు జానకి, ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన దీపావళి సంబరం చూస్తే పండుగ ఆనందాన్ని అందరూ ఆస్వాదించవచ్చు. ‘దీపావళి.. దీపావళి.. ఇంటింటా ఆనంద దీపావళి- మా ఇంట మాణిక్య కళికావళి.. జిలుగుల వలువల అల్లుళ్ల తలుపు- కూతుళ్ల కులుకు.. పలుకుల వయ్యారి వదినల వనె్నలు- మురిసిపడు చినె్నలు.. రంగు మతాబుల శోభావళి’’ అంటూ పండుగనాడు కూతుళ్లు, అల్లుళ్లు ఆనందంగా జరుపుకునే వేడుకను ఈ పాటలో చిత్రీకరించారు. ‘చిటపట రవ్వల ముత్యాలు కురియ- రత్నాలు మెరియ, తొలకరి స్నేహాలు వలపుల వానగా- కురిసె సెలయేరుగా, పొంగే ప్రమోద తరంగావళి’ అంటూ బాణసంచాల హొయలు, అవి విరజిమ్ము వెలుగు రవ్వల సెలయేరులను అద్భుతంగా కవిత్వంలో ఆవిష్కరించారు, ఆనాటి సినీగీత రచయితలు. ‘పెళ్లికానుక’ చిత్రంలో దీపావళి శోభను అక్కా చెల్లెళ్లతోపాటు, అక్కకొడుకు, అక్క భర్తలతో జరుపుకునే హీరోయిన్ ఇలా పాడుతుంది. ‘‘ఆడే పాడే పసివాడా, ఆడేనోరుూ నీతోడ- ఆనందం వెల్లివిరిసే దీపావళి’’ అంటూ చిన్నపిల్లల నవ్వులే నిజమైన దీపావళి అంటూ ఈ పాటలో చెప్పారు. ‘చిన్నారి చెల్లి మా బంగారు తల్లి, నీవేనమ్మా మా ప్రాణము’ అంటూ దేవుడమ్మ చిత్రంలో చెల్లెలి సౌభాగ్యాన్ని ఆశిస్తూ దీపావళి బాణసంచా ఎంత ఆనందాన్నిస్తుందో ఆమె కాపురం కూడా అంత ఆనందంగా సాగాలని కోరుకుంటారు అన్నయ్యలు.
రామయతండ్రి చిత్రంలో ‘వెనె్నల రోజు ఇది పున్నమి రోజు, అమావాస్య నాడు వచ్చే పున్నమిరోజు’ అంటూ అమావాస్యకు, పున్నమికి సంబంధాన్ని కవి వినూత్నంగా చూపారు. ఇందులో మనిషి జన్మ చాలా ఉన్నతమైనదని, అది దీపం లాంటిదని, ఆవేశపడితే అనర్థం జరిగి ఆరిపోతుందని చెబుతూ తానందుకు సాక్ష్యమంటూ దీపం చేత చెప్పిస్తారు. ‘విచిత్ర జీవితం’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ పాడే ‘చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఓ దీపావళి’ అంటూ మనిషి జీవితం చీకటి వెలుగులమయంగా వుంటుందని, ఇక్కడ చీకటి వెలుగులంటే కష్టసుఖాలని వివరించే ప్రయత్నం జరిగింది. కష్టసుఖాలు జీవితంలో ఎంత భాగాన్ని పొందాయో బేరీజు వేయడమే ఈ దీపావళి పాట ఆంతర్యం. ‘దీపాలు వెలిగె.. పరదాలు తొలగె .. ప్రియురాలు పిలిచె రావోయి’ అంటూ దీపం మనిషి జీవితానికి ఆలంబనగా నిలుస్తుందని చెబుతూ గుడిగంటలు చిత్రంలో ఈ పాటను చిత్రీకరించారు. ‘దూరాకాశ వీధుల్లో తారాదీపాలు..’ అంటూ నిజమైన దీపావళిని తలెత్తిచూస్తే ఆకాశంలో నిరంతరం కనిపిస్తుంది అంటూ ఈ పాటలో గానం చేశారు. కార్తికదీపం చిత్రంలో ‘ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం, చేరనీ నీ పాద పీఠం కర్పూరదీపం’ అంటూ దీపావళి సందర్భం కాకపోయినా దీపం ప్రాముఖ్యతను ఈపాటలో వివరించారు. ‘సంబరాలో సంబరాలో దీపావళి పండగ సంబరాలో, పేదవాళ్ల గుండెల్లో సంబరాలో, గొప్పళ్ల గుండెల్లో గింగిరాలో’ అంటూ సంఘర్షణ చిత్రంలో విజయశాంతి, చిరంజీవి పేదవాళ్ల గుండెల్లో నిజమైన దీపావళి, వారికి అన్ని హంగులు అమరినప్పుడేనని, నిత్యం ఎదుర్కొనే సమస్యల వలలో చిక్కుకొని బాధపడే సామాన్యుడికి దీపావళి పండుగ ఓ సంబరం అందిస్తుందని చెబుతారు.
‘చీకటి వెలుగుల వేకువలో పొంగే తీయని రంగులు’ అంటూ దీపావళి నాడు మతాబులు ఎన్ని రంగుల హంగులు పోతాయో చెబుతారు. ‘ముద్దుల మనవరాలు’ చిత్రంలో చాలాకాలానికి తనకి కనిపించిన మనవరాలిని ముద్దుచేస్తూ సాగే పాటలో భానుమతి,సుహాసిని నటించిన ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. ‘ఎన్నాళ్లకొచ్చింది దీపావళి’ అంటూ మనవరాలిని నానమ్మ ముద్దుచేస్తూ పాడే పాట ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. దుబాయ్ శీను చిత్రంలో ‘దివాలీ హోలీ కలిసి మెరిసే ఖుషీ మాది’ అంటూ యువతరం నృత్యం చేస్తుంది. దీపావళి-హోలీ పండుగలు రెండూ యువతకు ఆనందాన్నిచ్చేవే. అలాంటి రెండు పండుగలు కలిసి ఒకేసారి వస్తే మరెంత ఆనందంగా వుంటుందో ఊహిస్తేనే ఆ అనుభవం ఆస్వాదించగలుగుతాం. ‘చెప్పలేని ఆనందం హోయ్, గుప్పుమంది గుండెలోన, అందమైన దేవలోకం నేలమీద పోల్చుకున్నా, పెదవుల్లో చిరునవ్వే మెరిసే హోలీ, ఎద పండే వెలుగులే తొలి దివాలి, మెరిసే నీలా దీపాలి’ అంటూ కళ్లల్లో జ్యోతుల్లేని ఓ పాపను ఉద్దేశించి రెబల్ చిత్రంలో కథానాయకుడు నిజమైన దీపావళి మనసులోనే ఉందని చెబుతాడు. ఇలా తెలుగు చిత్రాలలో దీపావళికి సంబంధించిన అనేక పాటలు ప్రేక్షకులకు వినోదంతోపాటు ఆనందాన్ని తద్వారా ఆధ్యాత్మికతను కూడా అందించాయనడంలో సందేహం లేదు.

-సరయు