కథ నచ్చితేనే మ్యూజిక్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.పి.పట్నాయక్.. తెలుగులో సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పాటలు అందించాడు. ఆ తరువాత దర్శకుడిగా మారి ‘బ్రోకర్’ చిత్రాన్ని చేసి అటు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ప్రస్తుతం రూపొందిస్తున్న చిత్రం ‘మనలో ఒక్కడు’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ చెప్పిన విశేషాలు...
మీడియానే టార్గెట్
ఈ సినిమా మెయిన్‌గా మీడియాని టార్గెట్ చేసి తీసిన సినిమా. అంటే మీడియా చూపుతున్న ఈగోని ఇందులో చూపిస్తాం. మీడియాలో జరిగే కరెప్షన్, బ్లాక్‌మెయిలింగ్‌ను మించి ఈ ఈగో ప్రమాదకరంగా మారింది. జర్నలిస్టులను మాత్రమే టార్గెట్ చేయలేదు. మొత్తం మన రాష్ట్రంలో వున్న మీడియా వ్యవస్థని టార్గెట్ చేశాను. ప్రస్తుతం మీడియా ఎలా బిహేవ్ చేస్తుంది, దానివలన ఒక కామన్ మ్యాన్ ఎలా ఇబ్బంది పడ్డాడు అనేది చెప్పాను.
కమర్షియల్ అంశాలు
నా దృష్టిలో ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టే కథ చెప్పడమే పెద్ద కమర్షియల్ పాయింట్. దానే్న ఫాలో అయ్యాను. ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్టవుతుంది. ముఖ్యంగా ప్రతి జర్నలిస్టుకి నచ్చుతుంది. మీడియాని టచ్ చేస్తున్నా.. ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎలాంటివైనా సరే వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రియల్ ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. కొన్ని రోజుల క్రితం వేణుమాధవ్ చనిపోయాడని చెప్పారు. అప్పుడు వేణుమాధవ్ బయటికొచ్చి తాను చనిపోకుండా చనిపోయానని ఎలా న్యూస్ వేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళు చెప్పింది నిజం చేయడానికి ఒకవేళ తనను ఏమైనా చేస్తారని భయంగా ఉందని, తనకు సెక్యూరిటీ కావాలని అన్నాడు. అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. అలాగే ఎం.ఎస్.నారాయణ చనిపోకముందే చనిపోయాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని చాలా బాధపెట్టారు. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.
సొల్యూషన్ ఉంది
మీడియా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా బిహేవ్ చేయాలి అనే చెప్పాను. ప్రతి జర్నలిస్టుకి ఈ సొల్యూషన్ నచ్చుతుంది. ఎన్ని ఇబ్బందులున్నా సరే చెప్పే వార్తల్లో నిజముండాలి. అదే నేను చెప్పాను.
నేనే నటించడానికి కారణం
కథ రాసుకునేటప్పుడే నేనైతేనే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే వేరే హీరోలతో చేయిస్తే సామాన్యుడి పాత్రకి హీరోయిజం వచ్చేస్తుంది. అలా రాకూడదు. నైనేతే ఎలాంటి ముద్ర ఉండదు కాబట్టి చేశాను. నాది కృష్ణమూర్తి అనే ఓ మామూలు లెక్చరర్ పాత్ర. ఖచ్చితంగా ఈ సినిమా జనాలకు నచ్చుతుంది. నా గత సినిమా ‘బ్రోకర్’ కూడా మంచి సబ్జెక్ట్. ఇది కూడా అలాంటిదే. ఒకవేళ ‘బ్రోకర్’ సినిమా నచ్చనివాళ్ళు ఈ సినిమాకు రావొద్దు.
సంగీతం చేస్తా
నేను సంగీతం చేయాలంటే ఆ కథ నాకు బాగా నచ్చేదై ఉండాలి. అలా నచ్చే సబ్జెక్ట్స్ వస్తే ఖచ్చితంగా వేరే సినిమాలు కూడా చేస్తాను. ఇక దర్శకుడిగా సినిమాలు చేయాలనీ ఉంది. ఇప్పటికే నా దగ్గర రెండు మూడు కథలున్నాయి. స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే ఏదో ఒక సినిమా మొదలుపెడతాను. ప్రస్తుతానికి మెడికల్ మాఫియాపై ఓ కథ రెడీ చేస్తున్నా.

-శ్రీ