చిత్ర

ఉత్కంఠభరితంగా బేతాళుడు హీరో విజయ్ ఆంటోని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని కథానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు ‘బేతాళుడు’గా త్వరలో విడుదల కానుంది. ‘బేతాళుడు’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 6న ‘బేతాళుడు’ ఆడియో ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తెలుగు, తమిళంలో చిత్రం 18న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని నిర్మాత ఎస్.వేణుగోపాల్ అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యంగా ఉన్న నాకు కొనసాగింపు ఈ ‘సైతాన్’. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ చిత్రం. తెలుగునాట ‘బేతాళుడు’ పేరుతో విడుదల అవుతోందీ చిత్రం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతోపాటు వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. అరుంధతి నాయర్ నాయికగా నటిస్తున్నారు. దర్శకుడు ప్రదీప్‌కుమార్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దారు. ప్రదీప్ కలిపురయత్ సినిమాటోగ్రఫి ఓ అస్సెట్ ఈ చిత్రానికి. సైతాన్‌కు సంగీతం నేనే. పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. బిచ్చగాడు విజయం తరువాత విడుదల అవుతున్న సైతాన్ చిత్రంపై సహజంగా అంచనాలు అధికంగానే వుంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుంది’ తెలిపారు చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు.