అదేదారిలో అంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం తెలుగులో హీరోయిన్‌గా మంచి జోరుమీదున్న అందాలభామ అంజలి వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా బాలకృష్ణతో నటించిన ‘డిక్టేటర్’ ఈనెల సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా మరో క్రేజీ చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది అంజలి. ఇటీవలే టీవీ యాంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఆ చిత్రానికి సీక్వెల్‌గా చేస్తున్న ఓ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రానికి కథను దర్శకుడు ఓంకార్ సిద్ధం చేశాడు. కీలకపాత్రలో అంజలి నటిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.