సూర్య హీరో అయితే విలన్‌గా నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి, నయనతార జంటగా గోకుల్ దర్శకత్వంలో పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘కాష్మోరా’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో కార్తీ చెప్పిన విశేషాలు...
ఊహించని ఫలితం
ఆడియెన్స్ నుండి ఇంత మంచి రెస్పాన్స్‌ను ఊహించలేదు. సోషియో ఫాంటసీ, పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ వున్న సినిమా. రెగ్యులర్ కానె్సప్ట్ మూవీ కాదు. హారర్‌ర్‌కు కామెడీని జోడించడంతో ఫస్ట్ఫాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సెకెండాఫ్‌లో హిస్టారికల్ పార్ట్, రాజ్‌నాయక్ క్యారెక్టర్‌ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. రెండున్నరేళ్ళ ప్రయాణం. అందులో రాజ్‌నాయక్ క్యారెక్టర్‌కు తల లేకుండా ఉండేలా చూపించడం చిన్న విషయం కాదు. కథను ఊహించి చెప్పవచ్చు కానీ స్క్రీన్‌పై చూపించేటప్పుడు చాలా శ్రమించాం. కానీ ప్రేక్షకులనుండి వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది.
రీవర్క్ చేయాల్సి వచ్చింది
‘బాహుబలి’ సినిమాకు కాష్మోరాకు పోల్చొద్దు. బాహుబలి రిలీజ్ తర్వాత ఓ ట్రెండ్ క్రియేట్ చేయడంతో వార్ సీక్వెన్స్, సెట్స్ అన్నీ రీవర్క్ చేసుకున్నాం.
రెండూ పాత్రలు
కాష్మోరా అనే క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించాం. స్టార్టింగ్‌లో కొంత సీరియస్‌గా వుండే కాష్మోరా క్యారెక్టర్ తర్వాత కామెడీతో కూడుకుని ఉండటం, అందరినీ మోసం చేలా ఉండటంవల్ల, అలాంటి కాష్మోరా క్యారెక్టర్ రాజ్‌నాయక్ భవంతిలోకి వెళ్లినపుడు బిహేవ్ చేసే స్టయిల్ హ్యూమర్‌తో కలిసి ఉండాలి. అలాగే రాజ్‌నాయక్ క్యారెక్టర్ చేసేటప్పుడు గెటప్ చాలా కొత్తగా ఉండాలి. ఎవరూ ఇది కార్తీయే కదా అని వెంటనే గుర్తించకూడదు. ఆ క్యారెక్టర్ కాస్ట్యూమ్ నలభై కిలోలుంటుంది. దాన్ని వేసుకుని ఒకవైపు విలనిజాన్ని చూపుతూనే తనేంటో తన హావభావాలతో భయపెట్టాలి. ఈ రెండు క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇద్దరం చర్చించి సరికొత్తగా రూపుదిద్దే ప్రయత్నం చేశాం. దర్శకుడు మూడు క్యారెక్టర్లను తెరపై ప్రెజెంట్ చేసిన తీరు రియల్లీ సూపర్బ్.
అన్నయ్య మెచ్చుకున్నారు
అన్నయ్య సూర్య ఆడియెన్స్ మధ్య సినిమా చూశారు. ఇంటర్వెల్‌లో బ్యాంగ్‌లో అయితే బాగా నవ్వారు. ఈమధ్య ప్రేక్షకులు ఇంత బాగా నవ్వలేదని అన్నయ్య అనడం విశేషం. అలాగే సెకెండాఫ్‌లో థ్రిల్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సినిమా చూసిన తరువాత యూనిట్‌ను అభినందిస్తూ అనేక ఉత్తరాలు వచ్చాయి.
విజువల్స్ కీలకం
సినిమా విజయంలో విజువల్ గ్రాఫిక్స్ కీలకపాత్ర వహించాయి. కుక్క హీరోను తరమడం, కింగ్‌డమ్ రూపొందించిన గ్రాఫిక్స్‌తోపాటుగా కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతి విషయంలోనూ సాంకేతికత సినిమా విజయానికి కీలకంగా మారింది. చూసిన ప్రతి ఒక్కరూ బాగున్నాయని చెబుతున్నారు.
ద్విభాషా చిత్ర నిర్మాణం ఈజీకాదు
ఒక సినిమాను బై లింగ్వల్‌లో చేయడం అనే మాట చాలా సులభైనది. కానీ దాన్ని తెరకెక్కించేటప్పుడు చాలా కష్టపడాలి. ముఖ్యంగా డైలాగు విషయంలో మంచి రచయితలు అవసరం అవుతారు. వాళ్లుంటేనే పని సులభంగా అవుతుంది. రెండింటికీ వేరియేషన్స్‌ను కొత్తగా చూపించినప్పుడే ఆడియెన్స్‌కు నచ్చుతుంది. ప్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.
విలన్‌గా
ఈ సినిమా తరువాత నాకు విలన్‌గా చేయమని అవకాశాలు వస్తాయేమో అన్పిస్తోంది. కానీ పూర్తి స్థాయి విలన్‌గా మాత్రం నటించను. అన్నయ్య హీరో అయితే విలన్‌గా చేయడానికి నేను సిద్ధమే. అలా అయితే కాంప్రమైజ్ అవుతా!
నెక్స్ట్ ప్రాజెక్ట్స్
మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో వుంటుంది. మిలట్రీ అధికారిగా నటిస్తున్నాను. సినిమా దాదాపుగా పూర్తికావస్తోంది. మంచి లవ్‌స్టోరీ.

-శ్రీ