పాటలతో ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ అందిస్తున్న చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్‌తోపాటుగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను ఈనెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించిందని, సినిమా పాటలను ఆదిత్య ద్వారా నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని తెలిపారు. సినిమా విడుదలకు ముందు అభిమానులు, ప్రేక్షకుల నడుమ గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేయనున్నారు. అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు.