సుడిగాలిలా హిట్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. సుడిగాలి చిత్రానికి ముందు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ఈ సినిమాకి అంత ఆదరణ లభిస్తోందని, పోస్టర్లు కొత్తగా ఉన్నాయని, ఈ సినిమా హిట్‌గా నిలుస్తుందని తెలిపారు.
హాస్యంలో హారర్‌ను మిక్స్‌చేసి, ఈ సినిమా రూపొందించడానికి రిస్క్ చేశామని, టీమ్ అందరూ కష్టపడడంతో మంచి ప్రొడక్ట్ వచ్చిందని కథానాయకుడు నరేష్ అన్నారు. సంస్థ తీసిన మంచి చిత్రాల స్థాయిలో ఈ చిత్రం నిలుస్తుందని ఆయన అన్నారు. నరేష్ ఏ పాత్రకైనా సరిపోతాడనడానికి ఈ చిత్రం ఓ ఉదాహరణ అని, తొరిసారిగా డిఫరెంట్ జోనర్‌లో ఆయన హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని హీరో సుధీర్‌బాబు తెలిపారు. తొలుత ఈ కథను హాస్యంలోనే రాసుకున్నామని, వైవిధ్యంగా ఉండాలన్న కోరికతో హారర్‌ను మిళితం చేశామని, తెలుగు ఆడియన్స్‌కు కొత్త అనుభూతి ఈ చిత్రం అందిస్తుందని దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. కృతిక, వౌర్యాని కథానాయికలుగా నటించారు.