కాజల్ ప్రేమ ఎంతవరకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజల్ కథానాయికగా జీవ హీరోగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.కె. దర్శకత్వంలో డి.వెంకటేష్ అందిస్తున్న చిత్రం ‘ఎంతవరకు ఈ ప్రేమ’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, సెన్సార్‌కు పంపించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయని, అన్ని కేంద్రాలలో మంచి ఆదరణ లభిస్తున్న ఈ సినిమా ఫీల్‌గుడ్ చిత్రంగా రూపొందిందని తెలిపారు. సినిమాలో ప్రతి సీన్ వైవిధ్యంతో సరికొత్త స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా దర్శకుడు తీర్చిదిద్దారని, సినిమాకు కెమెరా పనితనం, సంగీతం హైలెట్‌గా నిలుస్తుయని తెలిపారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్‌తో యువతకు నచ్చేలా ఓ సందేశం అందించేలా ఈ చిత్రం రూపొందిందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, తప్పక విజయవంతవౌతుందని ఆయన తెలిపారు. బాబి సింహ, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, కెమెరా: అభినందన్ రామానుజమ్, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డి.కె.