మీలో ఒక్కడి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాపతి చిత్రశాల పతాకంపై ప్రజాపతి శంకర్ స్వీయ దర్శకత్వంలో ప్రజాపతి శంకర్, స్రవంతి, జై, జ్యోతి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ‘మీలో ఒక్కడి కథ’ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ క్లాప్‌నివ్వగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్విచ్చాన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శక నిర్మాత ప్రజాపతి శంకర్ మాట్లాడుతూ- అందరూ కొత్తవారితో నేను రూపొందిస్తున్న సినిమా ఇది. సామాజిక కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రం నవంబర్ నెలలో చిత్రీకరణ మొదలుపెట్టి చివరివరకూ పూర్తిచేస్తాం అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ- చిన్న సినిమాలతోనే పరిశ్రమ మనుగడ సాగిస్తోంది. చిన్న సినిమాలతోనే పరిచయమైన నటీనటులు పెద్ద స్థాయికి ఎదుగుతారు. మంచి కథతో శంకర్ తీస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. స్రవంతి మాట్లాడుతూ- ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:ప్రజాపతి శంకర్.