హలో బ్రదర్ సీక్వెల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 1994లో వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘జుడవా’ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. నాగచైతన్య హీరోగా ఈ చిత్రాన్ని సీక్వెల్ చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానుండగా, ఇందులో హీరోయిన్లుగా గ్లామర్ భామలు తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే జాక్వెలిన్ ఈ చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో నాగ చైతన్య నటిస్తే, హిందీలో మరో హీరో నటిస్తారని తెలిసింది. మొత్తానికి నాగ్ సినిమాతో చైతూ ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చైతన్య కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.