మంచి చిత్రాలకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి కథలతో చిత్రాలను నిర్మించాలనే సంకల్పంతో ఒన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌ను ప్రారంభించారు నిర్మాతలు ప్రశాంత్‌కుమార్, సుదర్శన్ రెడ్డి. ఈ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రాజ్ కందుకూరి, రామసత్యనారాయణ, ఆర్.కె.గౌడ్, సాయి వెంకట్, చిత్రం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ- మంచి కానె్సప్టుతో అందరూ కొత్తవారితో సినిమాలు చేస్తే తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ వుంటుందని, మంచి సంకల్పంతో నిర్మాతలుగా ప్రవేశిస్తున్న వీరిద్దరికీ మంచి విజయం దక్కాలని అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ, చిన్న సినిమాల నిర్మాణంవల్ల ఎంతోమంది పరిశ్రమకు పరిచయమవుతారని, అలాగే కొత్త టాలెంట్‌ను పరిచయం చేసే అవకాశం కూడా కలుగుతుందని, తప్పకుండా ఈ బ్యానర్ నుండి మంచి చిత్రాలు వస్తాయని కోరుకుంటున్నానని అన్నారు. ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ- మంచి కథలనెంచుకుని సినిమాలు తీయాలని కోరుకుంటున్నానన్నారు.