పవన్‌తో మళ్లీ త్రివిక్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందుతోందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలకి ఎట్టకేలకు తెరపడింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందే ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుని పటాలపై నటుడు పవన్‌కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది వంటి సంచలన విజయాల తరువాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న అనిరుధ్ మాట్లాడుతూ- ‘అ ఆ’ సినిమాకి మ్యూజిక్ చేయాల్సింది కానీ కుదరలేదు. పవన్ సినిమాకు సంగీతం చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. భిన్నమైన సంగీతాన్ని ఇవ్వగలనని అనుకుంటున్నా..’ అన్నారు. త్రివిక్రమ్‌తో ఇటీవలే ‘అ ఆ’ నిర్మించిన రాధాకృష్ణ, మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.