బస్ జర్నీలో మిక్చర్ పొట్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంత్, శే్వతా బసు ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్ కుమార్ ఎం.వి. దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ-‘పూర్తి కామెడీ జోనర్‌లో నిర్మించినా సమాజానికి సందేశాన్ని కూడా అందజేస్తున్నాం. ‘జబర్దస్త్’ టీం, అలీ, పోసాని, కృష్ణ్భగవాన్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. శే్వతాబసు ప్రసాద్ వల్ల సినిమాకు మంచి హైప్ వస్తుంది. త్వరలోనే ఆడియో, డిసెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం.’ అన్నారు. దర్శకుడు సతీష్‌కుమార్ మాట్లాడుతూ-‘అమలాపురం నుంచి షిరిడీ వరకూ బస్సు ప్రయాణం జర్నీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఈ ప్రయాణంలో డిఫరెంట్ క్యారెక్టర్లు పరిచయమైతే ఎలా వుంటుంది? జర్నీలో టైమ్‌పాస్ కోసం రకరకాల టాపిక్స్‌పై మాట్లాడుకుంటుంటాం. మా కథలో కూడా అలాంటి అంశాలే ఎలా హైలెట్ చేశామన్నది ఆసక్తికరం. ప్రస్తుతం రాజకీయాలపై సెటైరికల్ కామెడీని ట్రై చేశాం. ఇందులో శే్వత పాత్ర పేరు సువర్ణసుందరి. చింతామణి, కనక మహాలక్ష్మి పాత్రల్లా ఈ క్యారెక్టర్ కూడా తెలుగు ప్రేక్షకులకు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది.’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: చిరంజీవి.ఎస్, కెమెరా: కళ్యాణ్ సమీ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: మాధవపెద్ది సురేష్, కథ, కథనం, దర్శకత్వం: సతీష్‌కుమార్ ఎం.వి.