చిరు సినిమా రీమేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియోగ్రాఫర్ నుండి నటుడిగా, దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ కాంచన సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన గంగ కూడా మంచి విజయానే్న అందుకుంది. ప్రస్తుతం మెట్ట శివ కెట్ట శివ (తెలుగులో మొండి శివ గుండు శివ) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తాడట. చిరంజీవి అప్పట్లో మూడు పాత్రలు పోషించి ఆకట్టుకున్న ముగ్గురు మొనగాళ్లు చిత్రాన్ని రీమేక్ చేస్తానని అంటున్నాడు లారెన్స్. 1994లో విడుదలైన ఈ చిత్రం చిరంజీవికి నటుడిగా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా రీమేక్‌లో కూడా మూడు పాత్రలు చేసి అదరగొట్టాలని చూస్తున్నాడు లారెన్స్. అన్నట్టు ముగ్గురు మొనగాళ్ళు చిత్రం 1982లో వచ్చిన రజనీకాంత్ ‘మూండ్రుముగం’ సినిమాకు రీమేక్. ఓ వైపు చిరంజీవి, మరోవైపు రజనీకాంత్ మూడు పాత్రలు చేసి ఆకట్టుకోవడంతో లారెన్స్ కూడా అదే ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.