లక్కున్నోడు వచ్చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు, హన్సికా మోత్వాని జంటగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘లక్కున్నోడు’. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ-‘గీతాంజలి, త్రిపుర వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కిరణ్ దర్శకత్వంలో విష్ణు నటిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా వుంటుంది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద విజయాల తరువాత విష్ణు-హన్సికల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం వుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈనెలాఖరువరకు జరిగే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:పి.జి.విందా, సంగీతం:అచ్చు, సహనిర్మాత:రెడ్డి విజయకుమార్, నిర్మాత:ఎం.వి.వి. సత్యనారాయణ, దర్శకత్వం:రాజ్‌కిరణ్.