హారర్ కామెడీగా నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో, హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. ‘మై స్వీట్ హార్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంది. ఈ నెల చివరివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ, ‘విశాఖ, అరకు, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. దర్శకుడు చిత్రాన్ని చెప్పినదానికంటే కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ నెల రెండో వారంలో ఆడియో విడుదల చేసి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు రెడ్డెం యాదకుమార్ మాట్లాడుతూ, ‘ఇది లవ్ అండ్ హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. సిటీ నేపథ్యంతో పాటు గ్రామీణ నేపథ్యంలోనూ కథ నడుస్తుంది. సత్యానంద్, వారి అబ్బాయి పాత్రలు సినిమాకు చాలా కీలకంగా వుంటాయి. వీరిరువురూ కలిసి నటించడం ఇదే ప్రథమం’ అన్నారు. గోపీచరణ్, ఐశ్యర్య హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, సత్యానంద్, ఐ.కె.త్రినాధ్, ధీరేంద్ర ధీరు, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్, చరణ్, జబర్దస్త్ అప్పారావు, జనార్దన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఉదయ్‌నాగ్ రతన్‌దాస్, మాటలు:ప్రసాదుల మధుబాబు, కెమెరా:ఎస్.వి.గోపాల్, ఎడిటింగ్:నర్సింగ్ రాధోడ్, నిర్మాత:పీరికట్ల రాము, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రెడ్డెం యాదకుమార్.