సినిమాలే నా లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలంగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ త్రిష ఈమధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మొదట్లో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం కానె్సప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకి చిత్రం పరాజయాన్ని ఇవ్వడంతో కాస్త వెనుకబడింది. ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్న త్రిష మళ్లీ గ్లామర్ పాత్రలతో తన ‘హవా’ను క్రియేట్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జిమ్‌లో కుస్తీలు పడుతున్న ఈమెను- ‘మీ జీవిత లక్ష్యం ఏమిటి?’అని అడిగితే- అదిరిపోయే జవాబిచ్చిందట. ఇంతకీ ఆ జవాబేంటో తెలుసా? ‘సినిమాలే నా జీవితం. సినిమాలు చేస్తూనే చనిపోవాలని కోరుకుంటా..’ అంటోంది. ఇటీవలే పెళ్లి తప్పిపోవడంతో- ‘సినిమాలు చేయాలి కాబట్టే అది తప్పిపోయిందేమో’ అంటూ జోక్ చేస్తోంది. భవిష్యత్తులో పెళ్లిచేసుకున్నా, నటిస్తూనే ఉంటానని సినిమాలే తనకు ముఖ్యమని చెబుతోంది.