యదార్థ కథతో ప్రేమభిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిల్, శ్రుతిలయ జంటగా శ్రీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కె.గాంధి దర్శకత్వంలో ఎం.ఎస్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన ఓ యదార్థ కథనాన్ని తీసుకుని స్క్రీన్‌ప్లే హైలెట్‌గా దర్శకుడు ఈ చిత్ర కథని తయారుచేశాడని, టాకీ పార్ట్ మొత్తం పూర్తయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలిపారు. సుమన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని, త్వరలో ఆడియో విడుదల జరిపి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుపుతున్నామని దర్శకుడు ఆర్.కె.గాంధి తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హైలెట్‌గా స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగుతుందని, పాటలన్నీ మంచి మంచి లొకేషన్లలో చిత్రీకరించామని ఆయన అన్నారు. త్వరలోనే విడుదలకానున్న ఈ చిత్రంలో కవిత, దేవిశ్రీ గురూజీ, షఫి, రాజేంద్ర, కింగ్ మోహన్, కిల్లర్ వెంకటేష్, జ్యోతి తదితరులు నటించారు.