మహేష్‌తో సినిమా తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతిసోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘మీలోఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని నవంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ తెలిపిన విశేషాలు..

కామెడీ ఎంటర్‌టైనర్
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్. రెండు గంటలపాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిచ్చే చిత్రమవుతుంది. రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. సినిమాను నవంబర్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
హీరో ఎవరో?
ఈ చిత్రంలో పృథ్వీ, నవీన్‌చంద్ర పాత్రలు నువ్వానేనా అనేలా ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కథ నచ్చగానే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌చేస్తే బావుంటుందని ఆలోచించాం. ఎన్నో విజయవంతమైన కామెడీ చిత్రాలను తెరకెక్కించిన సత్తిబాబుగారైతే సినిమాను అనుకున్నట్టుగా ప్రెజెంట్ చేయగలరనిపించింది. దాంతో ఆయన్ను కలవడం, ఆయన ఒప్పుకోవడం జరిగింది.
మూడు సినిమాలు
2017లో మూడు సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందులో నితిన్‌తో సినిమా చేయాలని ముందుగా అనుకున్నాం. అయితే ‘అ ఆ’ తర్వాత నితిన్ రేంజ్ ఇంకా పెరిగింది. కాబట్టి తనతో సినిమా చేయడానికి మంచి కథ, దర్శకుడు కావాలని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు నితిన్ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను పూర్తిచేస్తాడు. అలాగే నాగశౌర్యతో కూడా ఓ సినిమా చేయబోతున్నాం.
ఈ రెండు సినిమాలకు కథలను ఫైనలైజ్ చేసి డైరెక్టర్స్ ఎవరనే విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేస్తాం. గోపీచంద్‌ను రీసెంట్‌గా కలిస్తే ఓ కథ వినమన్నారు. కథ నచ్చితే చేద్దామని అన్నారు. ఆ సినిమాకు దర్శకుడెవరనే దానిపై ఆలోచనలు చేస్తాం.
బిజినెస్ రంగం నుండి..
నేను ఇంజనీరింగ్ చేశా, ఓ కంపెనీకి సి.ఇ.వోగా పనిచేస్తున్నా, ఈ కంపెనీ మెయిన్ ఆఫీస్ కెన్యాలో ఉంది. ఉగాండా, యు.ఎస్‌లో బ్రాంచీలున్నాయి. మంచి టీం సపోర్ట్‌తో బిజినెస్ వ్యవహారాలను చూస్తున్నాం. సినిమాలంటే ఆసక్తి ఉండటంతో 2007లో టాస్ చిత్రానికి కోప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చాను. వర్క్ చేశాను. 2009లో ‘అధినేత’ సినిమాను నిర్మించాను. ‘ఏమైంది ఈవేళ’, ‘ప్యార్‌మే పడిపోయానే’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలను చేశాను. సినిమాలంటే ఆసక్తి ఉంది కాబట్టి మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్నా.
మహేష్‌తో
మహేష్‌బాబుతో సినిమా చేయాలని డ్రీం ఉంది.. ఆయన ఓకే అంటే తప్పకుడా సినిమా చేస్తా.

- శ్రీ