అన్నపూర్ణలో నమో వేంకటేశాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే దాదాపు ఎనభై శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ నవంబర్ 15 నుండి 25 వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి ఆధ్యాత్మిక చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వేంకటేశ్వరస్వామి పరమభక్తుడైన హాథిరామ్ బాబా జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, మొత్తం చిత్రీకరణ పూర్తికాగానే యూనిట్ గ్రాఫిక్స్ విభాగంపై దృష్టి పెడుతుందని తెలుస్తోంది. మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యాజైస్వాల్, విమలారామన్, సౌరభ్ జైన్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రం జనవరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

చిత్రం.. ‘ఓం నమో వేంకటేశాయ’లో అనుష్క