ప్రేమకథలే నాకు సరిపోతాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవర్‌బాయ్‌గా దొరికే ఇమేజిలో ఓ ఆనందం వుంటుంది. ప్రేమకథలే నాకు పూర్తి కంఫర్ట్ జోనర్. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత ఈ నమ్మకం మరింత బలపడింది. ఇంకా వైవిధ్యమైన ప్రేమకథల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని అర్థమైందని’ నటుడు నాగచైతన్య తెలిపారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై గౌతమ్‌వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా మిరియాల రవిందర్ రెడ్డి రూపొందించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నాగచైతన్య చిత్ర విశేషాలను తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- మంచి డేట్స్ కోసమే ఆలస్యం
ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల చేద్దామనుకున్నాం. కానీ ద్విభాషా చిత్రంగా రూపొందించడం ఒక కారణమైతే, మంచి డేట్ కోసం ఎదురుచూడడం మరోకారణంగా చెప్పాలి. ఆ రెండు కారణాలతో ఈ సినిమా ఆలస్యమైంది. అయితే ఇంత లేటుగా వస్తున్నందుకు ఒత్తిడి ఏం లేదు. ప్రేమమ్ కంటే ఈ చిత్రమే ముందు విడుదల కావాల్సి వుంది. ఈ రెండు సినిమాలు నా కెరీర్‌లో వైవిధ్యమైనవే. ఇలాంటి వెరైటీ కథనాలలో నటించడంతో నటుడిగా పూర్తి సంతృప్తి పొందాను.
నా పాత్ర ఏంటంటే?
ఈ చిత్రంలో హీరో రెండు వేరు వేరు పరిస్థితుల్లో వుండి అక్కడ ఎదురయ్యే పరిణామాలు ఎలా ఎదుర్కొని విజేతగా నిలిచాడు అన్న కథనంతో సాగుతుంది. తొలి సగమంతా ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి సంబంధించిన కథనంగా వుంటుంది. రెండవ సగమంతా ఘర్షణ స్టైల్లో సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఇటువంటి పాత్ర చేయడం ఓ సవాలుగా నేను భావిస్తాను. హీరోకి తాను ప్రేమించిన అమ్మాయికి మధ్య ఎదురైన సమస్యను, ఆ అమ్మాయిని కాపాడటానికి హీరో చేసిన సాహసం ఇందులో దర్శకుడు సరికొత్త స్క్రీన్‌ప్లేతో వైవిధ్యంగా తీశారు. అందుకే ఈ చిత్రానికి పెట్టిన పేరు కథనానికి ఖచ్చితంగా సరిపోతుంది.
కొత్తగా వుంటుంది
ఈ సినిమా కోసం దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతి పాత్రను వైవిధ్యంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్ర చూస్తున్నప్పుడు ఆ పాత్రతో సాగిపోతాడు. తనను తాను ఊహించుకుంటాడు. తొలిసగం లవ్‌స్టోరీలోనూ, రెండవ సగం సస్పెన్స్ థ్రిల్లర్‌లోనూ ప్రేక్షకులు తమ కథే అనిపించేలా ఆలోచిస్తారు. ఏ మాయ చేసావె సినిమా తరువాత ప్రేమకథలు ఎలా నాకు నప్పుతాయంటారో ఈ సినిమా తరువాత యాక్షన్ జోనర్ కూడా నాకు నప్పుతాయని ప్రేక్షకులు ఒప్పుకుంటారు. ఇప్పటివరకూ చేయని వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్‌తో, ఒరిజినల్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా సాగుతుంది. ఆ విధంగా నన్ను దర్శకుడు తీర్చిదిద్దారు. నేను చేసే ఏ సినిమా అయినా రియలిస్టిక్‌గా వుండాలని కోరుకుంటా.
తమిళంలో కూడా
ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల చేయనున్నాం. అయితే, తమిళ షూటింగ్ ముందుగానే మొదలైంది. తెలుగు, తమిళంలో నేనే చేస్తానని దర్శకుణ్ణి అడిగాను. తమిళ హీరోలు ఇక్కడ నటిస్తున్నట్లే నేను కూడా అక్కడ నటించడానికి ప్రయత్నించాను. వచ్చే ఏడాది మరో తమిళ చిత్రం చేయడమే నా లక్ష్యం.
మేలో పెళ్లి
పెళ్లి గురించి చెప్పాలంటే తొలుత అఖిల్ పెళ్ళే జరగనుంది. తన పెళ్లిని రోమ్‌లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగుతుంది. మేలో అఖిల్ పెళ్లి వుంటుంది. ఆ తరువాతే నా పెళ్లి.
తరువాతి చిత్రాలు
కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం అవుతోంది. ‘నినే్నపెళ్లాడుతా’ తరహాలో ఓ అందమైన ప్రేమకథగా వుంటుంది. ఈ సినిమాకు ఇంకా పేరు ఏమీ నిర్ణయించలేదు. మరో సినిమా కృష్ణ దర్శకత్వంలో డేవిడ్ నాథన్ అందించిన కథతో తెరకెక్కిస్తున్నాం. హలోబ్రదర్ చిత్రానికి రీమేక్ చేయాలని అనుకున్నాం కానీ అది క్లాసిక్ కావడంతో ఆ స్థాయిలో నేను నటించలేనని విరమించుకున్నాను.

-యు