వైవిధ్యంగా డర్టీగేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయ్యుమ్, నందినీ కపూర్ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మిస్తున్న పొలిటికల్ క్రైమ్ థిల్లర్ చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ, డర్టీగేమ్ చాలా బాగా వచ్చిందని, కథలో వైవిధ్యం ఉంటుందని, చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. నటుడు సురేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో చాలా మంచి పాత్రలో నటించానని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. నిర్మాత తాడి మనోహర్‌కుమార్ మాట్లాడుతూ పక్కా ప్లానింగ్‌తో అతి తక్కువ టైమ్‌లో టాకీపార్ట్ చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రంతో తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్నానని ఖయ్యూం అన్నారు. ఖయ్యుమ్, నందినీకపూర్, పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, అస్మిత, రమ్య, తాడి మనోహర్ నాయుడు, జబర్దస్త్ టీమ్ మొదలగువారు నటిస్తున్నారు.