అలా చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకు అవకాశాలివ్వమని అవతలివాళ్లను అడగడం ఇష్టముండదని, ఎవరివద్దా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరమే లేదని చెబుతోంది అందాల భామ ఇలియానా. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఈమె, బాలీవుడ్‌పై వున్న ఆసక్తితో అక్కడికి చెక్కేసింది. సౌత్‌నుండి చాలా అవకాశాలు వచ్చినా కూడా దేనికీ ఓకె చెప్పలేదు. ఇక బాలీవుడ్‌లో వచ్చిన అడపా దడపా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈమెకు అక్షయ్‌కుమార్ సరసన నటించిన ‘రుస్తుం’ చిత్రం మంచి విజయానే్న తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా విజయంతో అజయ్‌దేవగన్ సరసన బాద్‌షా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.
రుస్తుం దెబ్బకి చాలా అవకాశాలు వస్తాయనుకున్న ఇలియానాకు కాస్త నిరాశే మిగిలింది. అవకాశాలు రావడం లేదు కదా అని అడిగితే పై సమాధానం చెబుతోంది. మొత్తానికి తనకు బాలీవుడ్ సినిమాల్లో నటించడమే ఇష్టమని, మన దగ్గరికి వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటానని, ఒకరి దగ్గరికెళ్లి అవకాశాలు ఇవ్వమని అడుక్కోనని గట్టిగానే చెబుతోంది.