కొత్త ప్రేమాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమాయణాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను తికమకపెట్టేస్తున్నాయి. ఇప్పటికే పలువురు భామలు ఘాటు ప్రేమాయణంలో మునిగిపోయారు. తాజాగా మరో ప్రేమాయణాన్ని కొత్తగా మొదలుపెట్టింది అందాల భామ కత్రినాకైఫ్. ఈమె కొంతకాలంగా రణబీర్‌కపూర్‌తో ఘాటు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి వ్యవహారంపై బాలీవుడ్ కోడై కూసింది కూడా. ఓ దశలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ కత్రినా రణబీర్‌నుండి విడిపోయింది. ఆ తరువాత రణబీర్ మరో హీరోయిన్‌తో తిరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు కత్రినా కూడా కొత్త ప్రేమాయణం మొదలుపెట్టిందట. ఇంతకీ ఆమె మొదలుపెట్టిన ప్రేమాయణంలో ప్రేమికుడెవరో తెలుసా? ముకేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందట. ఇటీవలే దీపావళి సందర్భంగా అమితాబ్‌బచ్చన్ ఇంట్లో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారితోపాటు కత్రినా-ఆకాష్‌లు కూడా రావడం అందరికీ షాకిచ్చిందట. మొత్తానికి కత్రినా కొత్త ప్రేమాయణం మొదలుపెట్టిందని బాలీవుడ్‌లో గుసగుసలాడుకుంటున్నారు.