టైటిల్ అది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘ధ్రువ’ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తరువాత రామ్‌చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తికావచ్చిన ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి రానుంది. సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌లో తెరకెక్కే ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా వుంటుందట. ఇక ఈ సినిమా టైటిల్‌పై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రానికి ‘ఫేస్‌బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18’ అనే టైటిల్ పెడతారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. మొత్తానికి ఈ టైటిల్‌పై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ ‘ఇప్పుడు మీడియాలో ఈ టైటిల్ గురించి రకరకాల ప్రచారం జరుగుతోం ది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఏ టైటిల్‌ను అనుకోలేదు’ అని తెలిపాడు. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీస్ పతాకంపై ఈ సిని మా రూ పొందనుంది. త్వరలో నే ఈ సినిమా కు సం బంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.