పవన్‌కు జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్.
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ క్రేజ్ తెచ్చుకున్న ఈమెకు ఓ దశలో మెగా హీరోయిన్ అనే బిరుదు వచ్చింది. ఎందుకంటే, వరుసగా మెగా హీరోల సినిమాల్లో నటిస్తూ
సంచలనం రేపింది. ప్రస్తుతం మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్‌కు మరో క్రేజీ
అవకాశం దక్కింది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించే సినిమాలో రకుల్‌కు హీరోయిన్‌గా
అవకాశం వచ్చిందట. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తరువాత ఆయన నీసన్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించే చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇదివరకు నయనతార నటిస్తుందని వార్తలొస్తున్నాయి. తాజాగా నయన ప్లేస్‌లో రకుల్ చేరింది. మొత్తానికి మెగా హీరోలందరితో నటిస్తున్న ఈ భామ చిరంజీవి సినిమాలో నటిస్తే మెగా హీరోలందరితో నటించి నిజంగానే మెగా హీరోయిన్ ఇమేజి తెచ్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.