ఐదు షోలు.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న సినిమాను బతికించాలంటే ఏం చేయాలి. అదే ఆలోచనతో కొన్ని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్త ఆలోచనలు, అభిరుచులతో సిద్ధమైన లోబడ్జెట్ సినిమాలు బాగుంటున్నా ప్రేక్షకుల చెంతకు వెళ్లడం లేదు. పెద్ద సినిమాలకు లభించినంతగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకపోవడమే పెద్దసమస్య. ఆ సమస్యను పరిష్కరించాలంటే ప్రతి థియేటర్‌లో రోజుకు ఒక షో అయినా చిన్న సినిమాకు కేటాయించాలి. క్యూ బాధ తప్పించేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించాలి. ఇలా ఎన్నో సూచనలు చేస్తోంది తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్. కొత్త సినిమా విడుదలైందంటే చాలు, ఉదయానే్న తెల్లవారకముందే తమ అభిమాన హీరో సినిమాను మొట్టమొదటే చూడాలని, టిక్కెట్ మొదటే సంపాదించాలని క్యూలు కట్టే అభిమానులకు ఇప్పుడు ఓ శుభవార్త అలరిస్తోంది. థియేటర్లలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన పద్ధతి ద్వారా విక్రయించాలని, తద్వారా రాష్టమ్రంతటా టిక్కెట్ టాక్స్ విధానం అమలుచేస్తే తాజాగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణాకు ఆదాయం లభిస్తుందని తెలంగాణా స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుపుతోంది. ఇన్నాళ్లుగా ప్రేక్షకులు క్యూలో నిలబడి టిక్కెట్లను కొనే ఇబ్బంది తప్పనుంది. థియేటర్‌లలో కూడా బాక్సాఫీస్ అంటూ పేరు పెట్టి టిక్కెట్లు ఒకే కౌంటర్ ద్వారా కంప్యూటర్ నియంత్రణలో విక్రయిస్తుండటంతో చాలామందికి మేలే జరుగుతోంది. థియేటర్లు కూడా క్యూకోసం ప్రత్యేకంగా కౌంటర్లను, ప్రేక్షకులు వరుసలో నిలబడి టిక్కెట్లు కొనడానికి అనువుగా కట్టించే నిర్మాణాలు కూడా తెరమరుగు కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఒక్క నిబంధనను మాత్రమే ప్రత్యేకంగా ఉటంకించడంలేదు. దాదాపుగా ఆరు విన్నపాలను ప్రభుత్వానికి విన్నవించుకుంది. అందులో మొదటిది- ప్రతి థియేటర్‌లోనూ చిన్న చిత్రాల కొరకు ఐదో ఆట ప్రదర్శించాలని చెబుతోంది. ఇప్పటికే థియేటర్‌లో నాలుగు ఆటలు ప్రదర్శిస్తుండటంతో అవి అన్నీ అగ్ర హీరోలకే సరిపోతున్నాయి. అందుకే చిన్న సినిమాను ఐదో ఆటగా వినోదపు పన్ను రద్దుతో ప్రదర్శించాలని అడుగుతున్నారు. అయితే ఈ ఐదో ఆట ఉదయానే్న ప్రదర్శిస్తారా లేక రెండో ఆట పూర్తయ్యాక ప్రదర్శిస్తారా అనే దానిపై పూర్తి వివరణ ఇవ్వాల్సి వుంది. థియేటర్ మెయింటనెన్స్ ఛార్జీలను ప్రభుత్వం పెంచాలని మరో డిమాండ్ ఉంది. థియేటర్‌ను పరిశుభ్రంగా వుంచడం విషయంలో తలెత్తిన అనేక వాదోపవాదల నేపథ్యంలో థియేటర్‌ను ప్రేక్షకులకు నచ్చేలా పరిశుభ్రంగా వుంచడానికి ప్రభుత్వం అందిస్తున్న ఛార్జీలను పెంచడం తప్పనిసరి అవుతోంది. థియేటర్ అందంగా, పరిశుభ్రంగా లేకపోతే ప్రేక్షకుడు అటువైపు రావడానికి జంకుతున్నాడు. సి క్లాస్, బి క్లాస్ థియేటర్ వైపు తొంగి చూసినా పెద్ద మొత్తంలో టిక్కెట్లు కొనుగోలు చేసే ఏ క్లాస్ మాత్రం అటు వైపు చూడడానికి ఇష్టపడటంలేదు. అందుకే థియేటర్ నిర్వహణ ఖర్చులను పెంచాలన్న డిమాండ్ సబబుగానే తోస్తోంది. కరెంట్ టారీఫ్‌ను ఇండస్ట్రియల్ టారిఫ్ క్రింద తీసుకురావాలని గత కొనే్నళ్లుగా పోరాటం చేస్తూనే వున్నారు. విద్యుచ్ఛక్తి వినియోగంతోనే సినిమా థియేటర్లు మనుగడ సాగిస్తాయి. అలాంటి థియేటర్‌కు విద్యుచ్ఛక్తి సరఫరా విషయంలో భారీ స్థాయి టారిఫ్‌ను విధించడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొంత ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తోంది. అందుకే థియేటర్‌లో వినియోగిస్తున్న విద్యుచ్ఛక్తిని ఇండస్ట్రియల్ టారిఫ్ క్రిందకు తీసుకురావాలని అడుగుతున్నారు. అలా పరిశ్రమల టారిఫ్ క్రింద తీసుకువస్తే విద్యుచ్ఛక్తి బిల్లులు కొంతలో కొంత తగ్గుతాయని ఆశ. అలాగే మండల హెడ్ క్వార్టర్స్ మరియు రూరల్ ప్రాంతాలలో సినిమా హాల్ లేని చోట మినీ థియేటర్ల నిర్మాణం జరగాలని కోరుతున్నారు. వాటికి సంబంధించిన స్థలాలను కేటాయించడం, సబ్సిడీ ఇవ్వడం, ఐదు సంవత్సరాల టాక్స్ హాలీడే లాంటి అంశాలపై చర్చ జరగాలని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేస్తోంది. మినీ థియేటర్లు కట్టడానికి ఇప్పటికే వేదిక సిద్ధమవుతోంది. సబ్సిడీలు, హాలీడే టాక్స్ లాంటి విషయాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో సాగుతాయి. అన్నీ కుదిరి సానుకూల నిర్ణయాలు వస్తే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని ఛాంబర్ అధ్యక్షుడు పి.రాంమోహన్‌రావు, సెక్రటరీ కె.మురళీమోహన్ ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. 1941లో ది హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌గా ఏర్పడిన సంస్థ ఇప్పటివరకూ 75 సంవత్సరాలుగా తన సేవలను అందిస్తోంది. 2014వ సంవత్సరంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌గా మారింది. దక్షిణ భారతదేశంలోనే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థగా పేరొందింది. దాదాపుగా ఈ సంస్థలో 3,382మంది సభ్యులు ఉన్నారు. వారిలో 2,600మంది నిర్మాతలు కాగా, 2,003 మంది డిస్ట్రిబ్యూటర్లు, 468మంది థియేటర్ యజమానులు ఉండగా, ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అధికారికంగా గుర్తింపు పొందడంతో సంస్థ కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాతలు చిత్రాలకు సంబంధించిన బ్యానర్ రిజిస్ట్రేషన్‌లో, టైటిల్ నమోదు, పబ్లిసిటీ క్లియరెన్స్ లాంటి అన్ని అంశాలు సంస్థ నుండి పొందాల్సి వుంటుంది. సెన్సార్‌కు సంబంధించిన అనుమతి పత్రాలు కూడా పొందవచ్చు. ఛాంబర్ ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భంగా త్వరలో డైమండ్ జూబిలీ ఉత్సవాలను కమిటీ నిర్వహించనుంది.

సమాజంలో మార్పు కోసం..
సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి పోతున్నాయి కానీ సమాజాన్ని ఏ మాత్రం ఆలోచింపజేసే చిత్రాలు రావడంలేదు. తరిగిపోతున్న విలువలు, నైతిక బాధ్యతలు, తల్లిదండ్రుల గొప్పదనం, ప్రేమలో త్యాగం లాంటి అంశాలతో సినిమాలను తీయడానికి నిర్మాతలు జంకుతున్నారు. ప్రేక్షకులకు ఓ సరికొత్త చిత్రాలను అందించడానికే ఇప్పటికే మూడు పెద్ద చిత్రాలను ప్రారంభించామని నిర్మాత డి.వెంకటేష్ తెలియజేశారు. ఇప్పటికే తమ సంస్థ నుండి అందాల ప్రేయసి, పిజ్జా-2, ఎంతవరకు ఈ ప్రేమ లాంటి చిత్రాలను సిద్ధం చేశామని, త్వరలో భారీ చిత్రాలను అగ్రహీరోలతో రూపొందించడానికి సమాయత్తమవుతున్నామని తెలిపారు. సినిమా తీసి విడుదల చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్న ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్మాతలకు థియేటర్లను అందించడానికి, వారికి ఇతోధిక సహాయం చేయడానికి తమ సంస్థ పంపిణీ బాధ్యతను కూడా నెత్తికెత్తుకోనుందని, ముఖ్యంగా చిన్న నిర్మాతల పరిస్థితులను అర్థం చేసుకుని వారికి తోడ్పాటు అందించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. చిన్న చిత్రాలతోపాటు భారీ బడ్జెట్ చిత్రాలను కూడా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని, పంపిణీ రంగంలో తమ ముద్రను వేయడానికి ముఖ్యంగా చిన్న నిర్మాతలకు అండదండగా వుండడానికి, మంచి చిత్రాల విడుదలకు కృషిచేస్తామని ఆయన తెలిపారు.

-యు