బుల్లితెరపై రంభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి అందాల తార రంభ రీ ఎంట్రీ ఇస్తోంది. తన అందాలతో కుర్రకారును మత్తెక్కించి డాన్సులతో, నటనతో అభిమానులను సంపాదించుకున్న ఆమె రీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ వార్త వారికి ఆనందాన్ని ఇచ్చేదే. అయితే ఈసారి రంభ నటిగా కాకుండా కొత్తదారిలో కనిపించనుంది. తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే అన్ని వయసులవారికి సంబంధించిన వేదికగా త్వరలో బుల్లితెరపై ప్రసారం కానున్న ‘ఎబిసిడి’ కార్యక్రమానికి ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులు ఎప్పటిలాగే ఈ కార్యక్రమాన్ని చూసి ఆదరిస్తారన్న నమ్మకం వుందని ఆమె తెలిపారు.