అఖిల్ చిత్రంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘అఖిల్’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా వచ్చి ఏడాదికిపైగా అయినా ఇప్పటికీ అఖిల్ తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపిన అఖిల్ ఫైనల్‌గా మనం ఫేం విక్రంకుమార్‌కు ఓకె చెప్పాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఓ మాజీ హాట్ హీరోయిన్ నటిస్తోందట. అప్పట్లో తనదైన గ్లామర్‌తో కుర్రకారు హృదయాలను పిండేసిన టబూ కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా క్రేజ్ తెచ్చుకున్న ఈమె, ఆమధ్య పాండురంగడు, ఇదీ సంగతి చిత్రాల్లో నటించింది. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలు చేయడం లేదు. మళ్లీ ఇంత గ్యాప్ తరువాత అఖిల్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పిందట. నాగార్జునతో పలు చిత్రాల్లో నటించిన టబు, ఇప్పుడు ఆయన తనయుడు సినిమాలో నటించేందుకు సిద్ధమవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇందులో టబు పాత్ర ఎలా వుంటుందో చూడాలి!