నానితో ప్రియాంకా చోప్రా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చలకు తెరలేపిన వార్త ఇదే. నాచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానితో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా సినిమా చేస్తుందట. అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కాదు నిర్మాతగానట. ఆ వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతూ, మరోవైపు హాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వసూభగ్నానితో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే భోజ్‌పురి, మరాఠి, పంజాబీ భాషల్లో చిత్రాలు నిర్మించింది. ఇప్పుడు ఈ భామ చూపు సౌత్ సినిమాపై పడింది. అందులో భాగంగా మొదట ఓ యువహీరోతో తెలుగు చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేసిందట. తెలుగులో ప్రస్తుతం క్రేజీ హీరోగా ఎవరున్నారని సెర్చ్ చేస్తే నాని పేరు వినిపించిందట. వెంటనే నానితో సినిమా చేయడానికి ఫిక్స్ అయిందని ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిసింది. నాని గతంలో యశ్‌రాజ్ బ్యానర్‌లో ‘ఆహా కళ్యాణం’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నానికున్న క్రేజ్‌తో మళ్లీ అతనికి ఈ ఛాన్స్ దక్కడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.