చిన్న సినిమాలకు గుర్తింపు ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సినిమా తెలుగులోకి అనువాదం చేయాలనుకున్నపుడు ఆ సినిమా లైన్ ఎలా వుంది? ఏ జోనర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు? అనే అంశాలను గమనించి ఆ చిత్రాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఏ సినిమా అయినా డిఫరెంట్‌గానే అందించే ప్రయత్నం చేస్తాం. ఈ మూడు చిత్రాలు విడుదలయ్యాక మా సంస్థ గౌరవం పెరుగుతుందని భావిస్తున్నాం.
పరిశ్రమలో చిన్న సినిమా పేరుతో మంచి చిత్రాలు అందించేవాళ్ళకు సరైన గుర్తింపులేదు. సినిమా తీయాలంటే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. డబ్బింగ్ చిత్రాలంటే మరీ చిన్నచూపు. పెద్ద సంస్థలు విడుదల చేసే ఫ్లాప్ సినిమాలకు థియేటర్లు ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నారు. అదే ఓ మంచి చిత్రం విడుదలచేస్తామంటే ఆదరణ కరవవుతోందని నిర్మాత డి.వి. తెలిపారు. డి.వి.క్రియేషన్స్ పతాకంపై ఆయన మూడు చిత్రాలను తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రాలకు సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాల నేపథ్యంలో ఆయన పలు వివరాలు తెలిపారు.
మూడు చిత్రాలు
ప్రస్తుతం మా సంస్థ నుండి మూడు అనువాద చిత్రాలు విడుదలకానున్నాయి. అందులో పిజ్జా-2కి సంబంధించిన ఆడియో విడుదలవుతోంది. అందాల ప్రేయసి, కాజల్ నటించిన ఎంతవరకు ఈ ప్రేమ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ‘ఎంతవరకు ఈ ప్రేమ’ ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.
సెన్సార్ సమస్య
తమిళంలో కవళైవేండామ్ చిత్రానికి సంబధించిన సెన్సార్ సమస్య వచ్చింది. విడుదల తేదీ ప్రకటించాక రెండు మూడు రోజుల ముందు సెన్సార్‌కు వెళ్లడం ఆనవాయితీ. ఎంతవరకు ఈప్రేమ చిత్రానికి సంబంధించిన ఇబ్బంది సెన్సార్‌తో ఎదురవ్వడంతో ఇక్కడ కూడా సెన్సార్ ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే చిత్రాన్ని విడుదల చేయడం వాయిదా వేశాం.
ఎంతవరకు కథనం
కాజల్, జీవా నటించిన ఎంతవరకు ఈప్రేమ చిత్రంలో రొమాంటిక్ కామెడీ జోనర్‌ను చర్చించాం. కాజల్ ఈ సినిమాలో చాలా నాచురల్‌గా నటించింది. ఆమె కెరీర్‌లో ఇది ఓ డిఫరెంట్ పాత్రగా చెప్పవచ్చు. సినిమా చూస్తే, ప్రేక్షకులు కూడా సరికొత్త కథనమే అని ఒప్పుకుంటారు.
పిజ్జా-2
మన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను ఈ చిత్రం చెబుతుంది. ఇద్దరి వ్యక్తులు సంభాషిస్తుంటే, మూడో వ్యక్తి కన్ను ఆ ఇద్దరినీ గమనిస్తూ వుంటుంది. మనకు తెలియకుండానే మన విషయాలను తెలుసుకునే అనేకమైన కోణాలను ఈ చిత్రంలో చర్చించాం. ఇదో వైవిధ్యమైన చిత్రం. ఇదే ఈ సినిమాలో కామన్ పాయింట్. దర్శకుడు చిత్రాన్ని థ్రిల్లర్‌గా రూపొందించాడు.
అందాల ప్రేయసి
సాఫ్ట్‌వేర్ కెరీర్‌లో నేటి యువతీయువకులు ఎలా వున్నారు? వారి ప్రేమ కథలు, డేటింగ్‌లు, వ్యక్తిగత సమస్యలు, డైవర్స్ లాంటి అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. యువతీ యువకుల మధ్య జరిగే పలు ఆసక్తికరమైన అంశాలను దర్శకుడు సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాడు. ఓ అందమైన సాఫ్ట్‌వేర్ అమ్మాయి, మరో అబ్బాయి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ డెవలప్ అయింది అన్న నేపథ్యంలో, అతనికెంతమంది స్నేహితురాళ్లు వున్నారు? ఆమెకు ఫేస్‌బుక్‌లో ఎంతమంది మగ స్నేహితులున్నారు? అన్న కోణాలలో ఈ చిత్రంసందేశాత్మకంగా సాగుతుంది.
డబ్బింగ్ చిత్రాలెందుకంటే..?
ఓ మంచి విలువలున్న చిత్రం, నేటి యువతీ యువకులకు ఏదైనా సందేశం ఇవ్వడానికి అనువైన కథలున్న చిత్రాలను అనువాదం చేయడానికి ముందుకు వచ్చాయం. మొదట్లో రాంగోపాల్‌వర్మతో 365 డేస్, వంశీతో వెనె్నల్లో హాయ్ హాయ్ లాంటి చిత్రాలను రూపొందించాం. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు. అందుకే ఇదే సేఫ్ జోన్ అని భావించి మంచి చిత్రాలనే అందిస్తున్నాం.
జాగ్రత్తలు
ఓ సినిమా తెలుగులోకి అనువాదం చేయాలనుకున్నపుడు ఆ సినిమా లైన్ ఎలా వుంది? ఏ జోనర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు? అనే అంశాలను గమనించి ఆ చిత్రాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఏ సినిమా అయినా డిఫరెంట్‌గానే అందించే ప్రయత్నం చేస్తాం. ఈ మూడు చిత్రాలు విడుదలయ్యాక మా సంస్థ గౌరవం పెరుగుతుందని భావిస్తున్నాం.
తెలుగు నేటివిటితో
డబ్బింగ్ సినిమాలైనా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం నిరంతరం జరుగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి తెలుసు కనుక వాళ్లకి నచ్చిన పద్ధతిలోనే రూపొందిస్తున్నాం. ఎక్కువగా తమిళ సినిమాలై మన తెలుగులో అనువాదం చేయడానికి అనువుగా వుంటాయి. మలయాళం నుండి, కన్నడం నుండి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే అనువుగా వుంటాయి. మా అనువాద చిత్రాల్లో పాటలన్నీ స్ట్రెయిట్ చిత్రం వున్న తెలుగు పాటల్లాగే వుంటాయి. అందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం.
ప్రమోషన్ కాదు
ఓ సినిమాకు మంచి ప్రమోషన్ వుంటే హిట్ అవుతుంది అనడం సరికాదు. కొంత ప్రభావం మాత్రం వుంటుందని చెప్పగలం. బయ్యర్లు కూడా ప్రమోషన్ ఎలా వుందనే అంశం గమనిస్తూంటారు. సినిమాలో సబ్జెక్టు వుంటే- అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంటుంది.

-యు