థ్రిల్లర్ కథతో నాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం ఉదయం అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌కు ఆయన సరికొత్త లుక్‌తో విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాగార్జున కథానాయకుడుగా పివిపి పతాకంపై ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-2 చిత్రం ముహూర్తపు సన్నివేశంపై కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా ప్రసాద్ వి.పొట్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో నిర్మాత మాట్లాడుతూ తమ సంస్థ మరో ప్రతిష్ఠాత్మక చిత్రంగా దీన్ని రూపొందిస్తోందని, నాగార్జున సూచనలతో స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, నాగార్జున కెరీర్‌లోనే ఇది బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుందన్నారు. గత సంవత్సరం దసరాకు విడుదలైన రాజుగారి గది హిట్టయిన ఉత్సాహంతో నాగార్జునను ఈ సినిమాలో కొత్తగా చూపిస్తానని దర్శకుడు ఓంకార్ అన్నారు. మనం, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన చిత్రాల తర్వాత ఏం చేయాలా? అనుకున్న సమయంలో నమో వెంకటేశాయః లో నటించానని, ఆ తర్వాత నిర్మాత మంచి కథ ఉందని చెప్పడంతో కొత్తగా అనిపించి, ఈ సినిమా చేస్తున్నానని నాగార్జున తెలిపారు. తనకిష్టమైన థ్రిల్లర్ జోనర్‌లో ఇంతవరకూ నటించలేదని, మనుషులతో ఆడుకునే ఓ వైవిధ్యమైన పాత్రలో తాను నటిస్తున్నానని చెప్పారు. సంగీత దర్శకుడు థమన్, అబ్బూరి రవి తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. వెనె్నల కిషోర్, అశ్విన్‌బాబు, ప్రవీణ్, షకలక శంకర్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దివాకరన్, సంగీతం: థమన్, మాటలు: అబ్బూరి రవి, నిర్మాత: పి.వి.పి, దర్శకత్వం: ఓంకార్.

క్లాప్ ఇస్తున్న దర్శకుడు కె.రాఘవేంద్రరావు