తమిళ్‌లో నిఖిల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలా వేసుకున్నాడు యువ హీరో నిఖిల్. ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకుంటున్న నిఖిల్ నెక్స్ట్ పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్ పేరెంట్స్.. అమ్మాయిని వెదికే పనిలో పడ్డారట. ఇక తెలుగులో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్, నెక్స్ట్ తమిళ సినిమా చేయాలనే ఆసక్తితో వున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. భిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే నిఖిల్.. తప్పకుండా తమిళ ప్రేక్షకులకు కూడా నచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమా తమిళంలోనే ఉండొచ్చని అంటున్నారు. తమిళ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పే నిఖిల్.. తన ఫోన్‌లో కాలర్ ట్యూన్ కూడా తమిళ సాంగ్‌ని పెట్టుకున్నానని, తమిళంలో మంచి కథతో ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తితో వున్నట్టు చెప్పాడు. మరి నిఖిల్ తమిళ ఎంట్రీ ఎప్పుడో చూడాలి?!