నాగ్ సరసన సీరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తిరస సినిమాలతో ఆకట్టుకున్న నాగార్జున ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మొదటిసారి థ్రిల్లర్ నేపథ్యంలో నటిస్తున్నాడు నాగ్. ‘రాజుగారి గది-2’ పేరుతో రూపొందే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. నాగార్జున ఓ పవర్‌ఫుల్ మంత్రగాడిగా కనిపిస్తాడని అంటున్నారు. అంటే నాగ్ స్టైల్‌లో ఉండే స్టయిలిష్ మంత్రగాడు అన్నమాట. ఆ గదిలో ఏం జరిగింది అనే ఆసక్తికర అంశాలతో రూపొందే ఈ సినిమాలో నాగార్జునకు జోడీ ఉండదు కానీ ఆయనతో ఓ స్పెషల్ సాంగ్‌తోపాటు కొన్ని సీన్స్ చేయడానికి హీరోయిన్ కావాలని, అందుకే ఓ హాట్ లుక్స్ వున్న హీరోయిన్‌ని దించుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమధ్య ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయిన సీరత్‌కపూర్. రొమాంటిక్ త్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో నాగ్, సీరత్‌లమధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. డిసెంబర్ మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.