అవాంతరాలను అధిగమించే బెలూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ కథానాయకుడు జై, అంజలి జంటగా 70 ఎం.ఎం. ఫిలింస్ పతాకంపై టి.ఎస్.అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ రూపొందించిన చిత్రం ‘బెలూన్’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. నాగినీడు విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఓ ప్రేమజంట ఎదుర్కొన్న అనేక అవాంతరాలు వారి జీవితాన్ని ఎలా మలుపులు తిప్పాయి అనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా కొడైకెనాల్‌లో షూటింగ్ జరిపిన ఈ సినిమా హీరో హీరోయిన్లకు ఓ మైల్‌స్టోన్‌లా నిలుస్తుందని తెలిపారు. 1989 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ హారర్ సినిమాగా చిత్రీకరిస్తున్నామని, నాగినీడు పాత్ర సినిమాలో సరికొత్తగా వుంటుందని, ప్రముఖ నటీనటులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:యువన్ శంకర్‌రాజా.