గెలిచే గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖయ్యూమ్, నందిని కపూర్ జంటగా షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- పొలిటికల్ క్రైం థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం కథ వైవిధ్యంగా వుంటుందని, ఖర్చుకు కూడా ఎక్కడా వెనకాడకుండా సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేశామని తెలిపారు.
పక్కా ప్లానింగ్‌ంతో రూపొందించిన ఈ సినిమాలో వర్తమాన రాజకీయ నేపథ్యం వుంటుందని, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూనే పొలిటికల్ గేమ్ ఎలా వుంటుంది? అందులో గెలిచారా? ఓడారా? అనే కథనంతో సినిమా సాగుతుందని, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా యాప్ట్ అయ్యే కథనం అని నిర్మాత తాడి మనోహర్ తెలిపారు. సినిమా త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతోందని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, అస్మిత, రమ్య, జబర్దస్త్ బృందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సునీల్ కశ్యప్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.