తెలుగుదనంతో మిస్టర్ కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్, రిచా గంగోపాధ్యాయ జంటగా ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్ కార్తీక్’. ఈ చిత్రాన్ని కె.బాబూరావు, కె.మల్లికార్జున్‌లు తెలుగులో అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల విడుదలై మ మంచి స్పందన పొందాయి. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలుపుతూ- తమిళంలో విజయవంతమైన ‘మయక్కం ఎన్నా’ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నామని, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా వుంటుందని, డబ్బింగ్, పాటలు, తెలుగు నేటివిటితో వుండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, సెల్వరాఘవన్ దర్శకత్వ ప్రతిభ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, ఈ సినిమాలో ఆయన వైవిధ్యమైన కథ, కథనాలతో తీర్చిదిద్దారని, ధనుష్ అభినయం హైలెట్‌గా వుంటుందని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:జి.వి.ప్రకాష్, మాటలు:శశాంక్ వెనె్నలకంటి, వెంకట్ మల్లూరి, నిర్మాతలు: కె.బాబూరావు, కె.మల్లికార్జున్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరాఘవ (సెల్వరాఘవన్)