డబ్బుకన్నా స్నేహం మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జె.వి.నాయుడు, రోషన్, రచనా స్మిత్ ప్రధాన తారాగణంగా శే్వతాక్రియేషన్స్ పతాకంపై జనార్దన్ శివలంకి దర్శకత్వంలో జాలే వాసుదేవనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘మనీ ఈజ్ హనీ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. జి.వసంత్ అందించిన ఆడియోను హైదరాబాద్‌లో సి.కల్యాణ్ విడుదలచేసి తొలి కాపీని రాజ్ కందుకూరికి అందించారు. థియేటర్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జనార్దన్ మాట్లాడుతూ, తొమ్మిది సంవత్సరాల కష్టంగా ఈ చిత్రాన్ని తయారు చేశానని, స్నేహం ముఖ్యం అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని, డబ్బు ప్రధానం కాదని సందేశం కూడా ఇస్తుందని ఆయన తెలిపారు. నెల్లూరు, తిరుపతిలలో విద్యాసంస్థలు ప్రారంభించిన తాను మంచి ప్రతిభ వున్న దర్శకుడితో ఈ చిత్రాన్ని రూపొందించామని, నలుగురు స్నేహితులమధ్య డబ్బువల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత నాయుడు తెలిపారు. మనీ నిజంగా హనీనా అన్న అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరూ డబ్బుకోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం చర్చనీయాంశంగా విడుదలవుతుందని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్యక్రమంలో సాయివెంకట్, ఆర్.కె.గౌడ్, వసంత్, రోషన్, జి.ఎం.ఆర్., వెంకీ, ఆశీష్, సురేష్ కొండేటి, బాల, భద్రం పాల్గొని చిత్ర విశేషాలు తెలిపారు. రష్మిజా, పోకల బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:రాజా చక్రం, సంగీతం:గుంజి శ్రీను, ఎడిటింగ్:బి.మహి, సంగీతం:జి.వసంత్, నిర్మాత:జాలే వాసుదేవ నాయుడు, రచన, దర్శకత్వం:జనార్దన్ శివలంకి.