కాల్షీట్లు కరువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో హిట్ అందించే హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం కాల్షీట్లు దొరకని కథానాయికగా ఎదిగింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడీకడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా షూటింగులు చేస్తోంది. రకుల్ ప్రీత్‌సింగ్ ఇంత బిజీగా మారుతుందని మొదట ఎవరూ ఊహించలేదు. ఆమెతోపాటు తెరంగేట్రం చేసిన హీరోయిన్లు అందరూ అక్కడే ఉండిపోయారు. తాజాగా మురగదాస్-మహేష్‌బాబు కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో తొలిసారిగా ప్రిన్స్‌తో నటించే అవకాశం కొట్టేసింది. రామ్‌చరణ్ సరసన నటించిన ధ్రువ కూడా ఈనెలలో కూడా విడుదలవుతోంది. నాగచైతన్య, కళ్యాణకృష్ణ కలయికలో రూపొందుతున్న మరో చిత్రంలో కూడా ఆమె హీరోయిన్. బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటిశ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కే ఓ మాస్ చిత్రంలో కూడా రకుల్ ప్రీత్‌సింగే కథానాయికగా నటిస్తుండడం విశేషం. వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్‌గా మారిన రకుల్, నిరంతరం ప్రయాణాలతో ఒక సినిమా నుంచి మరో సినిమా సెట్‌లోకి దూకేస్తోంది. ఇన్ని సినిమాలు చేస్తూ అందరికీ కావలసిన కథానాయికగా మారుతోంది. అదృష్టం అంటే రకుల్‌దే.