నేనొస్తానంటున్న హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, ప్రియాంకా పల్లవి ప్రధాన తారాగణంగా పరంధ్ కళ్యాణ్ దర్శకత్వంలో భాషా మజర్ రూపొందించిన చిత్రం ‘నేనొస్తా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఇటీవల సినిమాకు సంబంధింన టీజర్‌ను పూరి జగన్నాధ్ విడుదల చేయగా, మంచి ఆదరణ లభించిందని నిర్మాత తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- మంచి క్వాలిటీతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా థ్రిల్లింగ్‌గా సాగుతుందని, ఇప్పటికే సినిమాపై చూసిన వారందరూ అంచనాలు బాగున్నాయని చెప్పారని, బేసికల్‌గా థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టముండడంతో ఆ కోవలోనే ఈ చిత్రాన్ని రూపొందించానని తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని, నటులందరూ కొత్తవారైనా అద్భుతంగా నటించారని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు జరుపుతున్నామని దర్శకుడు తెలిపారు.