వంగవీటిపై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న వంగవీటి సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 23న విడుదల కానున్న ఈ సినిమాపై రంగా తనయుడు రాధ కోర్టులో పిటీషన్ వేశారు. వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన తండ్రి రంగా జీవితాన్ని తప్పుడుగా చిత్రీకరించారంటూ దర్శకుడు వర్మపై ఆయన కేసు పెట్టారు. ఈ పిటీషన్‌పై నేడు విచారణ జరిపిన ఉభయ రాష్ట్రాల హైకోర్టు కేసును కొట్టివేసింది. వంగవీటి సినిమాలోని కాపు, కమ్మ అనే పాటను తొలగించాలని ఆర్డర్ పాస్ చేసింది. ఈ సినిమాలోని పాటల్ని నిన్న విజయవాడలో విడుదల చేశారు. వర్మ మేకింగ్ స్టయిల్‌లో రూపొందిన ఈ సినిమా అనుకున్నట్లుగానే అనుకున్న డేట్‌కే విడుదల చేస్తామని చెప్పారు వర్మ.

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన వంగవీటి చిత్రంలోని పాటలు విజయవాడలో కెఎల్‌ఆర్ యూనివర్శిటీ గ్రౌండ్‌లో విడుదల చేశారు.