చరణ్ కోసమే వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన విజయం సాధించిన సింగం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది సింగం-3. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతోంది. శ్రుతిహాసన్, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య చెప్పిన విశేషాలు..
అల్లు అరవింద్‌కు రుణపడ్డా
నిజానికి ఈ చిత్రాన్ని ఈనెల 16న విడుదల చేయాలనుకున్నాం. కానీ చరణ్ నటించిన ‘్ధృవ’ చిత్రం 9న విడుదలవుతుంది కాబట్టి వారం గ్యాప్‌లో రెండు పెద్ద సినిమాలు వస్తే బావుండనే ఉద్దేశంతోనే మరో వారం వాయిదా వేశాం. ‘గజిని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన అల్లు అరవింద్‌కు నేనెప్పుడూ రుణపడి వుంటాను. ఆయన చరణ్ కలిసి చేసిన ధృవ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా.
ఫ్లేవర్ తగ్గదు
‘యముడు’, ‘యముడు-2’ చిత్రాలు ఎలా ఉంటాయో అచ్చం అలాగే వుండే సినిమా ఇది. సింగం సీరిస్ చేయడం నాకెప్పుడు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. నరసింహం పాత్ర ఫ్లేవర్ పోకుండానే ఈ మూడో భాగంలో కొత్తదనాన్ని చూపాం. పూర్తిస్థాయి మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నరసింహం పాత్ర లైఫ్‌లో జరిగే ఒక్కో ఫేజ్‌ని ఒక్కో సినిమాగా చూపిస్తున్నాం. ఈ పాత్ర ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ పవర్ ఏమాత్రం తగ్గదు.
నాకోసమే పుట్టిన పాత్ర
దర్శకుడు హరితో నాకిది ఐదవ చిత్రం. నాకోసమే ఒక పాత్ర క్రియేట్ అవుతుందని అనుకోలేదు. సింగం సిరీస్‌తో అని నిజమైంది. సినిమాను కూడా అద్భుతంగా తెరకెక్కించిన హరి అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. ఇక జ్ఞానవేల్‌రాజా పదేళ్లుగా నాతోపాటే ఉంటూ నా సినిమాలకు సహకరిస్తున్నాడు. ఆయనతోపాటు తెలుగు హక్కులు సొంతం చేసుకున్న మల్కాపురం శివకుమార్ మంచి ఫాషన్ ఉన్న వ్యక్తి. ఇక్కడ కూడా మంచి బిజినెస్ చేశారని తెలిసింది. తెలుగు, తమిళ బేధాలు లేకుండా అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈనెల 11న పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేస్తాం.

- యు