ఇన్‌స్పెక్టర్ కిరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగోత్రి స్టూడియోస్ ప్రై.లి. సమర్పణలో సలుకూటి సర్వేష్‌రెడ్డి నిర్మిస్తున్న ‘ఇన్‌స్పెక్టర్ కిరణ్’ సీరియల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేమ్ రోహిణి హీరోయిన్‌గా, విశ్వ హీరోగా నటిస్తున్న ఈ సీరియల్‌కు కార్తిక్ తవ్వ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. నటుడు విశ్వ మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్‌గా నటిస్తున్నాననీ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేమ్ రోహిణి ఈ సీరియల్‌లో ఇన్‌స్పెక్టర్ రోల్ చేస్తుందని, ఆమె ప్రక్కన కానిస్టేబుల్‌గా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. నిర్మాత సర్వేష్‌రెడ్డి నిర్మిస్తున్న మా సీరియల్ ఓపెనింగ్‌కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వడమే ఫస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నామని తెలిపారు. గంగతో రాంబాబు సీరియల్‌లో ఆదరించినట్లే.. ఈ సీరియల్‌ను కూడా ఆదరించాలని కోరారు. ఈ సీరియల్ ద్వారా అందరిని నవ్విస్తామని ధీమా వ్యక్తం చేశారు. నటి రోహిణి మాట్లాడుతూ.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తనకెంతో బ్రేక్ ఇచ్చిందని అన్నారు. యాక్సిడెంట్ తర్వాత ‘ఇనిస్పెక్టర్ కిరణ్’ సీరియల్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. కామెడీ సీరియస్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సీరియల్ రూపొందుతుందని ఆమె తెలిపారు. రాము వెంకీ మాట్లాడుతూ.. ఈ సీరియల్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించేందుకు పక్కా ప్లాన్‌తో వున్నారని అన్నారు. గతంలో మూడు చిత్రాలు చేసిన అనుభవం, ముత్యాలముగ్గు సీరియల్ చేసిన అనుభవం ఉన్న తనకు ఈ సీరియల్ బాధ్యతలు ఇచ్చినందుకు నిర్మాత సర్వేష్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రొడ్యూసర్: రాము వెంకీ, నిర్మాత: సలుకూటి సర్వేష్‌రెడ్డి, డైరెక్టర్: తవ్వ కార్తీక్.