నైజాం పిల్లోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైష్ణవి మూవీస్, సొహాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాల్వాన్, ప్రాచి అధికారి జంటగా కృష్ణమోహన్ దర్శకుడిగా నిర్మాత సునీల్ సాగర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం నైజాం పిల్లోడు (వీడు మహా మాస్‌గాడు). ఈ చిత్రం టాకీ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సునీల్‌సాగర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ చిత్రంలో ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయని త్వరలో సినిమాని విడుదల చేస్తామన్నారు. దర్శకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా 47 సినిమాల్లో సోలో ఫైటర్‌గా నటించిన మాజీ జాతీయ బాడీ బిల్డర్ బాల్వాన్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని భారీ యాక్షన్‌సీన్స్ డూప్ లేకుండా అద్భుతంగా చేసారని, యస్.కె.మజ్ను సంగీత సారథ్యంలో ఏడు పాటలు అద్భుతంగా ఉంటాయన్నారు. సత్యప్రకాష్, జీవా, అన్నపూర్ణ, ప్రసన్నకుమార్, దిల్ రమేష్, బండ జ్యోతి, సంపత్‌రాజ్, నందిని, పావలా శ్యామల నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఫైట్స్: సూపర్ ఆనంద్, నందు, ఎడిటింగ్: సాయిశ్రీనివాస్, నిర్మాత: సునీల్ సాగర్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం: ఎస్.కె.మజ్ను, దర్శకత్వం: కృష్ణమోహన్.