విడుదలకు సిద్ధంగా ఒక్కడొచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ... ‘ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసామనీ, త్వరలో వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌వచ్చింది. ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తియ్యడం జరిగింది. సినిమాకి అవి చాలాపెద్ద హైలైట్ అవుతాయి. హిప్‌హాప్ తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా విశాల్ కెరీర్‌లోనే కాస్టియస్ట్ మూవీ. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విశాల్‌కి మరో సూపర్‌హిట్ అవుతుంది. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.