అందరినీ అలరించే కల్యాణ వైభోగమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందినిరెడ్డి దర్శకత్వంలో దామూ రూపొందిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- యువత ప్రేమ పెళ్లి వంటి బంధాలపై వున్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, భావోద్వేగాలకు సరైన పీటవేసి మానవత విలువను చాటి చెప్పేలా కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని వారు తెలిపారు. త్వరలో ఆడియోను విడుదల చేసి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. పెర్లు మానె, రాశి ఐశ్వర్య, ఆనంద్, తా.రమేష్, ధన్‌రాజ్, హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:కళ్యాణ్ కోడూరు, కెమెరా:జి.వి.ఎస్.రాజు, ఎడిటింగ్:జునైద్ సిద్ధిక్, మాటలు, పాటలు:లక్ష్మీభూపాల్, నిర్మాత:కె.ఎల్.దామోదర ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:బి.వి.నందినిరెడ్డి.